Group-1 Exam: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్‌ ఇవే..

|

Oct 15, 2022 | 8:14 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి గ్రూప్ వన్ ఎగ్జామ్ కావడంతో టీఎస్‌పీఎస్సీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Group-1 Exam:  గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్‌ ఇవే..
Tspsc Group1 Prelims
Follow us on

ఆదివారం జరగనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది టీఎస్‌పీఎస్సీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి గ్రూప్ వన్ ఎగ్జామ్ కావడంతో టీఎస్‌పీఎస్సీ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. 503 పోస్టుల కోసం 3.80 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం 1,019 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఉదయం 8.30 గంటల నుంచే హాల్​లోకి అనుమతి ఇవ్వనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం10.15 తర్వాత హాల్ లోకి అభ్యర్థులను అనుమతించమని అధికారులు చెబుతున్నారు.

సీసీ కెమెరాల నిఘాలో..

కాగా అభ్యర్థులు హాల్​టికెట్లతో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్​ తీసుకురావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. పరీక్షా హాల్‌లోకి హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా ఐడీ కార్డ్‌, పెన్‌, పెన్సిల్‌ను మాత్రమే అనుమతిస్తామంటున్నారు. షూస్‌ అండ్ వాచ్‌ ధరించి రావొద్దని సూచిస్తున్నారు. అభ్యర్ధులకు ఏమైనా అనుమానాలుంటే ఆయా జిల్లాల్లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ సెంటర్లకి ముందే కాల్‌చేయాలి. ఎవరైనా మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కాగా హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు. అలాగే హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..