Telangana: గ్రూప్‌-2 కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

|

Jan 12, 2023 | 11:42 AM

తెలంగాణలో ఏం నడస్తోందన్నా.. అంటే ఉద్యోగాల జాతర నడుస్తోందన్నా అని ఎవరైనా చెప్పేస్తారు. అవును మరి.. తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తే..

Telangana: గ్రూప్‌-2 కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
Tspsc Group 2
Follow us on

తెలంగాణలో ఏం నడస్తోందన్నా.. అంటే ఉద్యోగాల జాతర నడుస్తోందన్నా అని ఎవరైనా చెప్పేస్తారు. అవును మరి.. తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తే.. ఉద్యోగార్థులకు ఓ విధంగా ఛాలెంజ్ విసురుతోంది. ఉద్యోగం కొట్టే సత్తా మీలో ఉందా? ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసుకోండి అంటూ వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంతో కీలకమైన నోటిఫికేషన్ గ్రూప్ 2. అదికూడా రానే వచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి అప్లికేషన్స్ ప్రారంభం కానుండగా చివరి తేదీ ఫిబ్రవరి 16 గా ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ.

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

ఇదిలాఉంటే.. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర బిసి ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్.. గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌ పరీక్ష కోసం ద్విభాషలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. మొత్తం 200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి జనవరి 23వ తేదీ నుంచి టీఎస్ బీసీ స్టడీ సర్కిల్, ఓయూ సెంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయంరూ. 5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. అర్హత గల అభ్యర్థులు https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం, 040-27077929, 7780359322 నంబర్‌లను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..