TS Govt Jobs 2022: డిసెంబర్‌లో వస్తున్నాయ్‌.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, 3, 4 వరుస నోటిఫికేషన్లు! తొలుత ఏదంటే..

|

Dec 16, 2022 | 6:41 AM

తెలంగాణలో గ్రూప్‌-2, 3, 4 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత..

TS Govt Jobs 2022: డిసెంబర్‌లో వస్తున్నాయ్‌.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, 3, 4 వరుస నోటిఫికేషన్లు! తొలుత ఏదంటే..
TSPSC notifications likely to be issued in December
Follow us on

తెలంగాణలో గ్రూప్‌-2, 3, 4 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని భావిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్‌-4 పోస్టులు, 783 గ్రూప్‌-2 పోస్టులు, 1373 గ్రూప్-3 పోస్టులతోపాటు అత్యధిక పోస్టులున్న గురుకుల ఉద్యోగ ప్రకటనలు త్వరగా వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నియామక సంస్థలు సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ప్రకటనల జారీకి వీలుగా ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాయి. ఇవే కాకుండా సుమారు 1,000 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కూడా ప్రకటనను జారీ చేయాల్సి ఉంది.

ఈ నోటిఫికేషన్లన్నింటినీ డిసెంబర్‌ 31లోగా జారీ చేయాలని టీఎస్పీయస్సీ యోచిస్తోంది. దరఖాస్తు స్వీకరణకు నెల రోజుల గడువు, ప్రిపరేషన్‌కు 3 నెలల సమయం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెలల్లో గ్రూప్‌ పరీక్షల నిర్వహణ చేపట్టకూడదని భావిస్తు్న్నారు. ప్రతి అభ్యర్ధి అన్ని పోస్టులకు పోటీపడే విధంగా రాత పరీక్షల తేదీలను రూపొందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులతో మరోసారి సమావేశమై ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. తొలుత అత్యధిక పోస్టులున్న గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టులకు ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ఫలితాలపై కూడా త్వరలో స్పష్టత రానుంది. వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 26న డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ కోసం పరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్పీమస్సీ ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు అభ్యర్థులు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.