TSPSC FSO 2022 Exam Date: టీఎస్పీయస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ మంగళవారం (నవంబర్‌ 1) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా..

TSPSC FSO 2022 Exam Date: టీఎస్పీయస్సీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
TSPSC FSO Hall Ticket 2022

Updated on: Nov 01, 2022 | 6:49 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ మంగళవారం (నవంబర్‌ 1) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నవంబరు 7వ తేదీన రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

TSPSC FSO- 2022 హాల్‌ టికెట్లు ఎలా డైన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్‌ చెయ్యాలి.
  • ఆ తర్వాత పీఎస్‌ఓ-2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • టీఎస్పీయస్సీ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • వెంటనే హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • హార్డుకాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.