TS Transco Jobs: అక్టోబర్ 4న జూనియర్‌ లైన్‌మెన్‌ల పరీక్ష.. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుండంటే..

|

Sep 23, 2021 | 12:25 PM

TS Transco Jobs: తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబరు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్ష నిర్వహించనున్నారు.

TS Transco Jobs: అక్టోబర్ 4న జూనియర్‌ లైన్‌మెన్‌ల పరీక్ష.. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుండంటే..
Transco
Follow us on

TS Transco Jobs: తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబరు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటు ధ్రువపత్రాలను కూడా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 డిసెంబరులో 1100 జేఎల్‌ఎంల ఎంపిక కోసం తెలంగాణ ట్రాన్స్‌కో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రాత పరీక్ష కూడా పూర్తయ్యింది. అయితే, దీనిపై పలువురు కోర్టులో కేసు వేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో జేఎల్ఎం ల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18న జేఎల్ఎం పరీక్ష ఫలితాలను ట్రాన్స్ ప్రకటించింది. ఇప్పుడు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్షను నిర్వహిస్తున్నారు. అదే రోజున అభ్యర్థుల ధ్రువపత్రాలను సైతం పరిశీలిస్తారు. అయితే, ఈ పరీక్ష కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలోని 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులు సైతం స్తంభాలు ఎక్కాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, శారీరక వైకల్యం కలిగిన అభ్యర్థులకు స్తంభాలు ఎక్కే పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.

ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే..
ఇదిలాఉంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడైన తరువాతే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ సీటు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాత ఎన్ఐటీ, ఐఐటీల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, ఈకారణంగానే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాతే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా, అక్టోబర్ 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనుండగా.. వీటి ఫలితాలను అక్టోబర్ 15వ తేదీ నాటికి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తరువాత చాలా సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇతర విద్యార్థులకు అవకాశం లభిస్తుందని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

Also read:

Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..

Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..

Crime News: పురుగుల మందు తాగిన భార్య.. కాపాడబోయిన పిల్లలను బంధించిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే..