TS School SA 2 Exam Time Table 2022: తెలంగాణ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్‌ఏ-2) పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్‌ను విద్యాశాఖ బుధవారం (మార్చి 30) విడుదల చేసింది. తాజా టై టేబుల్ ప్రకారం పరీక్షలు ఈ ఏడాది (2022) ఏప్రిల్ 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అంటే కేవలం వారం రోజుల ముందు మాత్రమే తెలంగాణ విద్యాశాఖ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ విడుదల చేసిందన్నమాట. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. ఏ సబ్జెక్టు పరీక్ష ఏ రోజు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఐతే అధికారులు 20 రోజుల క్రితమే ప్రతిపాదన పంపినా పాఠశాల విద్యాశాఖ కార్యాలయం టైం టేబుల్‌కు ఆమోదం తెలపకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో గందరగోలపరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు ఈ నెల 27వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పరీక్షల టైం టేబుల్‌తోపాటు పలు సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) తాజాగా సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (summative assessment-2) టైంటేబుల్‌ను జారీ చేసింది. రంగంలోకి దిగిన డీసీఈబీ అధికారులు త్వరితగతిన ప్రశ్నపత్రాలను ముద్రించి ఇవ్వాలని ప్రింటర్లకు విన్నవిస్తున్నట్లు సమాచారం.
Also Read: