TS Police Constable Hall Ticket Download 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 28న జరగనున్న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ రోజు (ఆగస్టు 18న) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా పోలీస్ శాఖలో దాదాపు 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిల్లో భాగంగా ఎస్‌ఐ పోస్టులకు ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తయ్యింది. ఈ క్రమంలో ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధిచిన ఫలితాలు సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐతే దీనిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.