TS Inter Result Date 2023: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. రిజల్ట్స్ ఈ వారంలోనే..!

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మే మొదటి వారంలోనే ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు..

TS Inter Result Date 2023: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. రిజల్ట్స్ ఈ వారంలోనే..!
TS Inter Result 2023 Date

Updated on: May 02, 2023 | 12:41 PM

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వెల్లడిపై ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. మే మొదటి వారంలోనే ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. తొలుత మే రెండోవారంలో ఇంటర్‌ రిజల్ట్స్‌ ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు భావించినా, ఏపీలో ఇప్పటికే ఫలితాలు ఇవ్వడంలో ఇక్కడా త్వరగా ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. మరోపక్క రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు సర్కారు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం.

కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.47 లక్షల మంది విద్యార్ధులు అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వాల్యు వేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. రిజల్ట్ ప్రాసెస్‌, ట్రయల్‌ రన్‌, సాంకేతిక పరమైన లోపాలు అన్ని తరవుగా పరిశీలించామని.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడించేందుకు బోర్డు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.