TS Inter Exams 2022: నేటితో ముగిసిన తెలంగాణ ఇంటర్‌ 2022 పరీక్షలు.. జూన్‌ 20నాటికి ఫలితాలు!

|

May 24, 2022 | 11:58 AM

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మంగళవారం (మే 24)తో ముగిశాయి. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది..

TS Inter Exams 2022: నేటితో ముగిసిన తెలంగాణ ఇంటర్‌ 2022 పరీక్షలు.. జూన్‌ 20నాటికి ఫలితాలు!
Ts Inter Exams
Follow us on

Telangana intermediate exam 2022 results to be released in June: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మే 6న ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలు ప్రారంభమయినప్పనుంచి క్వశ్చన్‌ పేపర్లలో అక్షర దోషాలు, చేతితో రాసిన క్వశ్యన్‌ పేపర్ల పంపిణీ, ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష పేపర్లను విద్యార్ధులకు ఇవ్వడం.. ఇలా పలురకాలుగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలతో వార్తల్లో నిలిచింది. తప్పులుతడికలుగా జరుగుతున్న ఇంటర్‌ పరీక్షలు మంగళవారం (మే 24)తో ముగిశాయి. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది.

ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్‌ రెండో వారం చివరి నాటికి స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం (మే 23) జరిగిన ఇంటర్ ఫస్టియర్ మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలతో ముగిశాయి. వీటికి 490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 471 మంది హాజరయ్యారని బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇక నేటితో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు కూడా ముగుస్తున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జూన్‌ 20లోగా ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

ఇక ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 12-13 తేదీల్లో టెన్త్‌ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 25 లేదా 26 నాటికి ప్రకటిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభించడం సాధ్యం కాదు.

ఇవి కూడా చదవండి

2021-22 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయినందున.. ఈ ఏడాది జూన్‌లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జులై 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం త్వరలో పంపనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.