TS Inter Results 2022: మే 12 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం.. రిజల్ట్స్ ఎప్పుడంటే..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను గురువారం నుంచి మూల్యాంకనం చేపట్టనున్నారు..

Ts Inter Results
Telangana Intermediate result date 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను గురువారం నుంచి మూల్యాంకనం చేపట్టనున్నారు మొదటిగా సంస్కృతం జవాబు పత్రాలతో మూల్యాంకనం ప్రారంభమౌతుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు (TSBIE) టైం టేబుల్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జూనియర్ కళాశాలల్లో స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలను జూన్ 24లోపు వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓమర్ జలీల్ తాజాగా ప్రకటించారు.
Also Read:
