తెలంగాణ ఐసెట్- 2022 చివరి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఈ రోజుతో మూగియనుంది. విద్యార్ధులు ఈ రోజు (అక్టోబర్ 25వ తేదీ) ముగింపు సమయంలోపు వెబ్ ఆప్షన్లను ఇవ్వవల్సిందిగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సూచించింది. ఐసెట్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లో తమ ఎంపికలను సమర్పించవచ్చు. వీరందరికీ అక్టోబర్ 28న ప్రొవిజినల్ సీట్ల కేటాయింపు చేస్తారు. అక్టోబర్ 29, 31 తేదీల్లో విద్యార్ధులు సీట్లు పొందిన ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది. కాగా ఐసెట్ ఫేజ్ 1 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. చివరి దశ కౌన్సెలింగ్ పూర్తైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ఐసెట్- 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.