Telangana: గవర్నర్ తమిళిసైను కలవాల్సిందిగా విద్యాశాఖ మంత్రికి సర్కార్ ఆదేశాలు

|

Nov 09, 2022 | 5:33 PM

యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు.. ప్రస్తుతం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. బిల్లులో సందేహాలు నివృతి చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై మంత్రి సబితా..

Telangana: గవర్నర్ తమిళిసైను కలవాల్సిందిగా విద్యాశాఖ మంత్రికి సర్కార్ ఆదేశాలు
TS Edu Minister to meet Governor Tamilisai
Follow us on

యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు.. ప్రస్తుతం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. బిల్లులో సందేహాలు నివృతి చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. గవర్నర్ నుంచి నిన్న ప్రభుత్వానికి లేఖ అందలేదన్న మంత్రి ఈ రోజు (నవంబర్‌ 9) అందిందని స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌ను కలవమని ప్రభుత్వం నుంచి కూడా మంత్రి సబితాకు ఆదేశాలు జారీ అయ్యినట్లు తెలిపారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు..

‘గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరాము. అది ఇంకా ఖరారు కాలేదు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలు నివృత్తి చేస్తాం. గవర్నర్‌కు ఉన్న సందేహాలు ఏమిటో తెలియదు కాబట్టి ఇప్పుడే స్పందించలేము. అపాయింట్‌మెంట్ అందగానే కలుస్తాం. నిజాం కాలేజీ ఇష్యూ కూడా పరిగణలో ఉంది. సమస్య తెలుసు పరిష్కార మార్గం వెతుకుతున్నాం. ఇప్పటికే దీనిపై టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు సమాచారం అందించాం. విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్నారు. త్వరలోనే విద్యార్థుల సమస్యకూ పరిష్కారం సూచిస్తాం. ఈ విషయంపై త్వరలోనే ఓయూ వీసీ, కాలేజీ ప్రిన్సిపాల్‌ను కూడా పిలిచి మాట్లాడతానని’ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.