TS EAPCET 2024 Result: తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయ్‌.. ఇలా ఈజీగా చెక్‌ చేసుకోండి..

|

May 18, 2024 | 11:41 AM

తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్‌. తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే...

TS EAPCET 2024 Result: తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయ్‌.. ఇలా ఈజీగా చెక్‌ చేసుకోండి..
Ts Eamcet Results
Follow us on

TS EAPCET 2024 Result: తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అలర్ట్‌. తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈసారి టీఎస్‌ ఈఏపీసెట్ పరీక్షకు అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్‌ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం ఈఎపి సెట్ కి హాజరైన 3లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు రాశారు.

ఇక ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. శ్రీకాకుళం కుచెందిన జ్యోతి రాధిత్య పాలకొండ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. తర్వాత గోళ్ళలేఖ హర్శ కర్నూల్, రిషి శేఖర్ శుక్ల తిరుమల గిరి సికింద్రబాద్, సందేశ్.. హైద్రాబాద్, కర్నూలుకు చెందిన సాయి సాయి యశ్వంత్ రెడ్డి కర్నూల్‌కి చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే టాప్‌ 10లో మొదటి స్థానాల్లో పురుషులే ఉండడం గమనార్హం. 10వ ర్యాంక్‌ విజయ నగరంకు చెందిన శ్రీనిధి నిలిచారు.

అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ విషయానికొస్తే.. పురుషులు 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే మహిళలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా అధికారిక eamcet.tsche.ac.in లోకివెళ్లాలి.

* అనంతరం TS EAPCET 2024 Results ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

* తర్వాత మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.

* TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..