TS Eamcet 2022 Result link: తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) ఫలితాలు ఈ రోజు (ఆగస్టు12) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మిసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించగా సెకండ్, థార్డ్ ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్ధులు సాధించడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయి దీపిక సెకండ్ ర్యాంక్ సాధించగా, గుంటూరు జిల్లాకు చెందిన కార్తికేయ థార్డ్ ర్యాంక్‌లో నిలిచారు. ఇక అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులే కొల్లగొట్టారు. ఫస్ట్ ర్యాంకర్‌గా గుంటూరుకు చెందిన నేహ నిలువగా, సెకండ్ ర్యాంక్ విశాఖపట్నంకు చెందిన రోహిత్, థార్డ్ ర్యాంక్ గుంటూరుకు చెందిన తరుణ్ కుమార్ సాధించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫలితాలను చెక్ చేసుకోవడానికి పాస్‌వర్డ్ 2022@freedomతో ఆన్‌లైన్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. టీఎస్ ఎంసెట్ 2022 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు లక్షా 70 వేల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో1,56,812 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సులకు నిర్వహించిన పరీక్షకు 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 80.41 శాతం మంది, అగ్రికల్చర్ విభాగంలో 88.34 శాతం మంది అర్హత సాధించారు. త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.