THSTI Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్(faridabad) లోని ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 7
1. రీసెర్చ్ అసోసియేట్: 2
అర్హతలు: ఏదైనా లైఫ్ సైన్స్ సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకి రూ.47,000 నుంచి రూ.54,000లు చెల్లిస్తారు.
2. ప్రాజెక్ట్ అసోసియేట్లు: 5
అర్హతలు: ఏదైనా లైఫ్ సైన్స్ సబ్జెక్టులో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో కనీసం 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకి రూ.35,000లు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: