తెలంగాణలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్ మొదలు ఇతర విభాగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. తెలంగాణలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
MHSRB నోటిఫై చేసిన 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కింద 3,823 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)లో 757 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నిజానికి ఈ పోస్టుల దరఖాస్తు గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకున్న అధికారులు గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువును ఈ నెల 21వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీలోగా https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చనని అధికారులు సూచించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..