TGPSC Group 2 Final Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

TGPSC Group 2 Final Results 2025 out: గ్రూప్‌ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్‌ 28) మధ్యాహ్నం విడుదలయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్‌ 2 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్ర వెంకటేశం..

TGPSC Group 2 Final Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
TGPSC Group 2 Final Results

Updated on: Sep 28, 2025 | 3:51 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: తెలంగాణ గ్రూప్‌ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు ఆదివారం (సెప్టెంబర్‌ 28) మధ్యాహ్నం విడుదలయ్యాయి. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్‌ 2 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని, విత్ హెల్డ్‌లో పెట్టిన‌ట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 18 ర‌కాల పోస్టుల‌కు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫ‌లితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేష‌న్‌ను 2022లో విడుద‌ల చేయ‌గా, 2024 డిసెంబ‌ర్ 15, 16 తేదీల్లో రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో జరగడంతో ఓఎంఆర్‌ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో దాదాపు 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంక్ లిస్ట్‌ (మార్కులతో సహా)ను మార్చి 11న విడుదల చేసింది.

ఆ తర్వాత మెరిట్‌లిస్ట్‌ జారీ చేసి, అందులోని వారికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. ఇక గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వేచి ఉన్న కమిషన్.. శనివారం సీఎం రేవంత్ చేతుల మీదగా గ్రూప్‌ 1 అభ్యర్ధులకు నియామక పత్రాలు పంపిణీ చేయడంతో.. గ్రూప్‌ 2 ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.