విద్యార్ధులకు అలర్ట్.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్! రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే..
TGEAPCET 2026 Counselling Scheudle: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్.. TGEAPCET-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ కమిటీ..

TG EAPCET Counselling Schedule
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. TGEAPCET-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన అడ్మిషన్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి.
మొదటి విడత షెడ్యూల్
- జూన్ 19 నుండి జూన్ 28: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్.
- జూన్ 22 నుండి జూన్ 29: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్.
- జూన్ 25 నుండి జూలై 1: వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ. జూలై 1: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్.
- జూలై 4 న లేదా అంతకుముందు: మాక్ సీట్ అలోట్‌మెంట్ ప్రదర్శన.
- జూలై 5 నుండి జూలై 7: మాక్ అలోట్‌మెంట్ ఆధారంగా విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశం.
- జూలై 7: మొదటి విడత సీట్ల కేటాయింపు కోసం ఆప్షన్ల ఫ్రీజింగ్.
- జూలై 10 న లేదా అంతకుముందు: మొదటి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు.
- జూలై 10 నుండి జూలై 14: ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
రెండో విడత షెడ్యూల్
- జూలై 17: మొదటి విడతలో పాల్గొనని వారి కోసం ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్.
- జూలై 18: సర్టిఫికేట్ వెరిఫికేషన్.
- జూలై 18 నుండి జూలై 19: రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
- జూలై 19: ఆప్షన్ల ఫ్రీజింగ్.
- జూలై 22 న లేదా అంతకుముందు: రెండో విడత సీట్ల కేటాయింపు.
- జూలై 22 నుండి జూలై 24: ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్.
- జూలై 25 నుండి జూలై 28: కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ టి.సి (T.C), జెరాక్స్ సర్టిఫికేట్లతో అభ్యర్థులు నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి.
- జూలై 28: సీట్ల రద్దుకు చివరి తేదీ.
ఫైనల్ విడత షెడ్యూల్
- జూలై 31: మిగిలిపోయిన అభ్యర్థులకు స్లాట్ బుకింగ్.
- ఆగస్టు 1: సర్టిఫికేట్ వెరిఫికేషన్.
- ఆగస్టు 1 నుండి ఆగస్టు 2: కొత్తగా ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల నమోదు.
- ఆగస్టు 2: ఆప్షన్ల ఫ్రీజింగ్.
- ఆగస్టు 5 న లేదా అంతకుముందు: ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.
- ఆగస్టు 5 నుండి ఆగస్టు 7: ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు బ్రాంచ్/కాలేజీ మారిన వారు కొత్త కాలేజీలో రిపోర్ట్ చేయడం.
Follow Us
