Inter Result Date 2025: జవాబుపత్రాల మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు నయా ప్లాన్!.. ఈసారి విద్యార్ధులకు అంతా శుభమే..

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్ధులకు వార్షిక పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి 30వ తేదీ నుంచి జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా చకచకా పూర్తవుతుంది. ఇక జూన్ 1 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది..

Inter Result Date 2025: జవాబుపత్రాల మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు నయా ప్లాన్!.. ఈసారి విద్యార్ధులకు అంతా శుభమే..
Inter Answer Sheets Evaluation

Updated on: Apr 04, 2025 | 2:34 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 19 సెంటర్లల్లో ఏప్రిల్‌ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఎంతో పకడ్భందీగా ఈ సారి ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహిస్తున్న ఇంటర్‌ బోర్డు మూల్యాంకనం విషయంలోనూ తగు చర్యలు తీసుకుంటుంది. మూల్యాంకనం విషయంలో ఇంటర్‌బోర్డు ముందస్తు పునఃపరిశీలన చేయనుంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు రాలేదని, అధ్యాపకులు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు.

ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్‌ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో ర్యాండమ్‌గా పునఃపరిశీలిస్తున్నట్లు బోర్డు వర్గాలు తాజాగా తెలిపాయి. దీంతో విద్యార్థులకు మార్కుల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికానుండగా.. ఎప్పటికప్పుడు విద్యార్ధుల జవాబు పత్రాలను అధికారులు పునఃపరిశీలిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ చివరి వారంలోగా వెల్లడించేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది.

తెలంగాణ గురుకుల సెట్‌ 2025 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్‌ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఐదో తరగతి రెగ్యులర్‌ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల ఫలితాలు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు Telangana Gurukul CET 2025 పరీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ గురుకుల సెట్‌ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.