Telangana: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి వివరాలు ఇవే!

TG Ed.CET, TG ICET 2026 Schedule Released: తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి TG Ed.CET, TG ICET ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభ, చివరి తేదీలు, అలాగే పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది తెలంగాణ ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ముఖ్యమైన అప్‌డేట్.

Telangana: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఆ ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి వివరాలు ఇవే!
Tg Ed.cet, Tg Icet 2026 Schedule Released

Edited By:

Updated on: Jan 28, 2026 | 6:59 PM

తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి TG Ed.CET, TG ICET ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు బుధవారం విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే TG Ed.CET పరీక్షను ఈసారి కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఫిబ్రవరి 20న ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

TG Ed.CET పరీక్ష షెడ్యూల్

అలాగే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 23, 2026 (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 18, 2026 (శనివారం)తో ధరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఇక మే 12, 2026 (మంగళవారం) రోజున ఈ పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు జరగనుంది.

TG ICET పరీక్ష షెడ్యూల్

ఇదిలా ఉండగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG ICET ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 6, 2026న విడుదల కానుంది. అలాగే ఫిబ్రవరి 12, 2026 నుంచి ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 16, 2026 సోమవారంతో రిజిస్ట్రేషన్ గడువు ముగియనుంది.

ఈ పరీక్షలు మే 13, 14 లేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుండగా,సెకెండ్ సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు ఉంటుంది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించబడతాయి. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్లు సూచించారు.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.