TG EAPCET 2024 Counselling: జులై 4 నుంచి ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది...

TG EAPCET 2024 Counselling: జులై 4 నుంచి ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి!
TG EAPCET 2024

Updated on: Jun 27, 2024 | 2:57 PM

హైదరాబాద్‌, జూన్‌ 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. జులై 4 నుంచి 23 వరకు తొలిదశ, జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు రెండోదశ, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు చివరిదశ కొనసాగనుంది. కాగా మే 7 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ ఈఏపీసెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించగా.. మే 18న పలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 74.98 శాతం, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కౌన్సెలింగ్‌కు హజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ కింది ధ్రువపత్రాలను తమతోపాటు తీసుకురావల్సి ఉంటుంది. అవేంటంటే..

తొలిదశ కౌన్సెలింగ్‌

  • జులై 4 నుంచి జులై 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌
  • జులై 6 నుంచి జులై 13వ వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • జులై 8 నుంచి జులై 15 వరకు ఆప్షన్ల ఎంపిక
  • జులై 15న ఆప్షన్ల ఫ్రీజింగ్‌
  • జులై 19న సీట్ల కేటాయింపు
  • జులై 19 నుంచి జులై 26 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

రెండోదశ కౌన్సెలింగ్‌

  • జులై 26న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌
  • జులై 27న ధ్రువపత్రాల పరిశీలన
  • జులై 27 నుంచి 28 వరకు ఆప్షన్ల ఎంపిక
  • జులై 28న ఆప్షన్ల ఫ్రీజింగ్‌
  • జులై 31న సీట్ల కేటాయింపు
  • జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

మూడోదశ కౌన్సెలింగ్‌

  • ఆగస్టు 8న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌
  • ఆగస్టు 9న ధ్రువపత్రాల పరిశీలన
  • ఆగస్టు 9 నుంచి ఆగస్టు 10 వరకు ఆప్షన్ల ఎంపిక
  • ఆగస్టు 10న ఆప్షన్ల ఫ్రీజింగ్‌
  • ఆగస్టు 13న సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 13 నుంచి 15 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

కౌన్సెలింగ్‌కు తీసుకురావల్సిన సర్టిఫికెట్లు ఇవే..

  • పదో తరగతి మర్క్స్‌ మెమో
  • ఇంటర్మీడియట్ మార్కుల మెమో
  • ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(టీసీ)
  • స్టడీ సర్టిఫికెట్‌
  • లేటెస్ట్‌ ఇన్‌కం సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్‌
  • తెలంగాణ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు
  • ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.