TET 2025 Application Last Date: టెట్‌కు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Telangana TET 2026 online application: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET January 2026) జనవరి సెషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవగా నవంబర్‌ 29వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు దరఖాస్తు సమయం ముగింపులోగా..

TET 2025 Application Last Date: టెట్‌కు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
Telangana TET 2026 online application deadline

Updated on: Nov 27, 2025 | 5:27 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET January 2026) జనవరి సెషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవగా నవంబర్‌ 29వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు దరఖాస్తు సమయం ముగింపులోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ దరఖాస్తుల సవరణకు అవకాశాన్ని కల్పిస్తూ ఇటీవల ప్రకటన వెలువరించింది. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 1 వరకు దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని తన ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ టెట్ 2026 జనవరి ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- జనవరి 2026 సెషన్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పేపర్ 1 (తరగతి 1 నుంచి 5)కు ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు D.El.Ed / B.El.Ed / D.Ed (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి. పేపర్ 2 (తరగతి 6 నుంచి 8)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు బీఎడ్‌/ బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత లేదా B.A.Ed / B.Sc.Ed అర్హత ఉండాలి. భాషా పండిట్ పోస్టులకు సంబంధిత భాషా పండిట్ ట్రైనింగ్ ఉండాలి. చివరి ఏడాది D.El.Ed / B.Ed చదువుతున్న విద్యార్థులు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 29వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్ 1, 2 రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1000, ఏదైనా ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకునే వారు రూ.750 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక తెలంగాణ టెట్ పరీక్షలు జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్‌లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, సెకండ్‌ సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 4.30 గంటల వరకు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 27 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యలో ఫలితాలు వెలువడనున్నాయి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.