Telangana TET 2025 Exams: ఇవాళ్టి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. 66 పరీక్షా కేంద్రాల్లో 16 సెషన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్‌ 18) నుంచి టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్షల నిర్వహణకు మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. జూన్‌ 18 నుంచి 30 వరకు నిర్వహించనున్న టెట్‌ పరీక్షలకు..

Telangana TET 2025 Exams: ఇవాళ్టి నుంచే టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు.. 66 పరీక్షా కేంద్రాల్లో 16 సెషన్లు
TET 2025 Exams

Updated on: Jun 18, 2025 | 6:44 AM

హైదరాబాద్‌, జూన్‌ 18: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025) జూన్‌ సెషన్‌ పరీక్షలు వచ్చేశాయ్‌.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (జూన్‌ 18) నుంచి టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్షల నిర్వహణకు మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. జూన్‌ 18 నుంచి 30 వరకు నిర్వహించనున్న టెట్‌ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ కోసం మొత్తం 1,83,653 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌ 1కు 63,261 మంది, పేపర్‌ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 18, 19, 20, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే జూన్‌ 18, 19, 24 మొదటి షిఫ్టులో మాత్రమే టెట్ పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 28, 29, 30 తేదీల్లో జరగనున్న పేపర్‌ 2 పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 20, 23, 24 తేదీల్లో రెండో షిఫ్టులో మాత్రమే పరీక్షలు జరగుతాయి. జూన్‌ 27 తేదీన పేపర్‌ 1 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు 16 విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు గంట ముందే పరక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తమతోపాటు తీసుకురావల్సి ఉంటుంది. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ర్టిక్‌ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. కాగా టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్దులు తమ మార్కులు పెంచుకోవడానికి ఈ పరీక్షకు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.