TS TET 2023 Results: మరికాసేపట్లో విడుదల కానున్న తెలంగాణ టెట్‌-2023 ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

|

Sep 27, 2023 | 8:48 AM

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 10గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు టెట్‌ కన్వీనర్‌ రాధా రెడ్డి మంగళవారం (సెప్టెంబర్‌ 26) వెల్లడించారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఉదయం విడుదల చేసే టెట్‌ ఫలితాలతోపాటు ఫైనల్‌ ఆన్సర్‌ కీ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచుతున్నట్టు తన ప్రకటనలో..

TS TET 2023 Results: మరికాసేపట్లో విడుదల కానున్న తెలంగాణ టెట్‌-2023 ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..
TS TET 2023 results
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 10గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు టెట్‌ కన్వీనర్‌ రాధా రెడ్డి మంగళవారం (సెప్టెంబర్‌ 26) వెల్లడించారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఉదయం విడుదల చేసే టెట్‌ ఫలితాలతోపాటు ఫైనల్‌ ఆన్సర్‌ కీ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచుతున్నట్టు తన ప్రకటనలో కన్వినర్ తెలిపారు. తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారమే టెట్‌ ఫలితాలు విద్యాశాఖ విడుదల చేయడం గమనార్హం.

కాగా సెప్టెంబర్‌ 15న టెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. రెండు ఫిస్టుల్లో జరిగిన ఈ పరీక్షకు పేపర్‌ 1 పరీక్షకు 2,26,744 లక్షల మంది హాజరుకాగా.. పేపర్‌ 2 పరీక్షకు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ ప్రాథమిక ఆన్సర్‌ కీ సెప్టెంబర్ 20న విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం టెట్‌ ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెట్‌ పేపర్ 1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఇక పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఇప్పటికే తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.