TS TET 2023 Exam: మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న తెలంగాణ టెట్-2023 పరీక్ష.. నిముషం ఆలస్యం అయినా నో ఎంట్రీ!

|

Sep 15, 2023 | 8:05 AM

రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2023) జరగనుంది. పరీక్ష ఏర్పాటుకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పేపర్‌ 1కు 1,139 పరీక్ష కేంద్రాలు, పేపర్ 2కు 913 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం పరీక్ష జరగనుంది. ఉదయ జరిగే పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పేపర్ 2 పరీక్షకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

TS TET 2023 Exam: మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న తెలంగాణ టెట్-2023 పరీక్ష.. నిముషం ఆలస్యం అయినా నో ఎంట్రీ!
TS TET 2023 Exam
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15: రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2023) జరగనుంది. పరీక్ష ఏర్పాటుకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పేపర్‌ 1కు 1,139 పరీక్ష కేంద్రాలు, పేపర్ 2కు 913 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం పరీక్ష జరగనుంది. ఉదయ జరిగే పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పేపర్ 2 పరీక్షకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇక పేపర్‌ 1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్ 2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.

ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరననున్నాయి. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. మరికొన్ని గంటల్లో ఉదయం సెషన్‌ పరీక్ష ప్రారంభంకానుండగా ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్ధులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పరీక్ష సమయానికి గంట ముందే సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్ధులు ఇప్పటికే బయల్దేరారు.

పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఓఎమ్‌ఆర్‌ షీట్లపై ఆన్సర్లు సూచించడానికి రెండు బాల్‌ పాయింట్‌ బ్లాక్‌ పెన్నులు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఆధార్‌ కార్డు, హాల్‌టికెట్‌తోపాటు ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌ తప్పనిసరిగా తమవెంట తెచ్చుకోవాలని, లేకుంటే పరీక్షకేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే ఓఎమ్మార్‌ షీట్‌పై ఆన్సర్‌లను బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తోనే పూరించాలని, మరే ఇతర రంగు పెన్నుతో నింపడానికి అనుమతి లేదన్నారను. పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.

ఇవి కూడా చదవండి

హాల్‌టికెట్‌లో వచ్చిన పేరులో ఏవైనా అక్షరదోషాలు ఉన్నా.. అభ్యర్ధికి సంబంధిన వివరాలు సరిగ్గా లేకున్నా పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకుంటే లేటెస్ట్‌ పాస్‌ పోర్ట్‌ ఫొటో అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకుని సంబంధిత డీఈఓలను సంప్రదించాలన్నారు. వారి అనుమతి పొందిన తర్వాత మాత్రమే పరీక్షకు అనుమతిస్తామని వివరించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.