TSLPRB: తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి మొదలంటే.

|

Jul 29, 2021 | 1:20 PM

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను పోలీస్ నియామక మండలి జులై 4న విడుదల చేసింది...

TSLPRB: తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి మొదలంటే.
Tslprb Recruitment
Follow us on

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను పోలీస్ నియామక మండలి జులై 4న విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 11 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 29 అర్థరాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయమై పోలీస్ నియామక మండలి తాజాగా ప్రకటన జారీ చేసింది.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 151 పోస్టులకు గాను మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇది కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
* అప్లికేషన్‌ ఫీజును రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఈ www.tslprb.in ను సందర్శించడి.
* అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, సిగ్నేచర్‌, టెన్త్‌ సర్టిఫికేట్‌, డిగ్రీ సర్టిఫికేట్‌, బార్‌ కౌన్సిల్‌ సర్టిఫికేట్‌, లోకల్‌ బార్‌ అసోసియేషన్‌లో మూడేళ్లకు మించి పనిచేస్తున్నట్లు సర్టిఫికేట్‌, 1 నుంచి 7వ తరగతి వరకు చదువకున్న బోనఫైడ్‌ సర్టిఫికేట్‌, కమ్యూనిటీ/క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తో పాటు మరిన్ని డ్యాక్యుమెంట్లను నిర్దేశించి సైజులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read: TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు… విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఆ కోర్సులకు దరఖాస్తులు ఎప్పటినుంచంటే..