
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 6, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారిని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని బ్రాంచుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు దారులకు తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ కూడా తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్ 1, 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో నవరంబర్ 6, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసురకోవచ్చు. దరఖాస్తు పీజు కింద జనరల్/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.