Holidays 2023-24: అకడమిక్ ఇయర్ ​క్యాలెండర్ విడుదల.. విద్యార్థులకు 77 రోజులు సెలవులు

|

Apr 02, 2023 | 12:24 PM

TSBIE Holidays: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. 2023–24 అకడమిక్​ఇయర్‌లో విద్యార్థులకు 77 రోజులు సెలవులు ఇచ్చింది. విద్యా సంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని ప్రకటించింది.

Holidays 2023-24: అకడమిక్ ఇయర్ ​క్యాలెండర్ విడుదల.. విద్యార్థులకు 77 రోజులు సెలవులు
Tsbie
Follow us on

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. 2023–24 అకడమిక్​ ఇయర్‌లో విద్యార్థులకు 77 రోజులు సెలవులు ఇచ్చింది. విద్యా సంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని ప్రకటించింది. ఈ మేరకు 2023–24 అకడమిక్ ఇయర్​ క్యాలెండర్​ను విడుడల చేసింది ఇంటర్ బోర్డ్. అయితే, జూన్ 1వ తేదీ నుంచి నూతన తరగతలు ప్రారంభం అవుతాయని తెలిపింది ఇంటర్ బోర్డ్.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2023–24 అకడమిక్ ఇయర్​క్యాలెండర్‌ను శనివారం నాడు విడుడల చేసింది. వచ్చే నెల అంటే జూన్​1వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరంలో 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని, 77 రోజులు విద్యార్థులకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ సెలవుల్లో అక్టోబర్​19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ పేర్కొన్నది.

ఇదిలాఉంటే.. గత నెల మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు మంజూరు చేశారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి కాలేజీలు ఓపెన్ అవనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..