TS SSC 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

|

Apr 30, 2024 | 3:07 PM

TS 10th Class Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలను టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు..

TS SSC 10th Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
TS SSC Results 2024

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్‌ 30) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షల పలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పదో తరగతి ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. 2,676 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరిగాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2024 01:16 PM (IST)

    మే 15 వరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కు అవకాశం.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

    పదో తరగతి ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 15 రోజుల వరకు (మే 15 వరకు) రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ జరుగుతుంది. రీ కౌంటింగ్‌కు ఒక్కోసబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. రీవెరిఫికేషన్‌ కోసం రూ.1000 చెల్లించాలి. రేపట్నుంచి సప్లిమెంటరీతోపాటు కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫీజు చెల్లింపులు ప్రారంభం అవుతాయి.

  • 30 Apr 2024 01:14 PM (IST)

    జూన్‌ 2024 తెలంగాణ ‘టెన్త్’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే

    జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి డ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మే 16తో ఫీజు చెల్లింపులు ముగుస్తాయి. ఫెయిల్‌ అయిన విద్యార్ధులందరూ రీ కౌటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫలితాల కోసం ఎదురు చూడకుండా జూన్‌ 2024 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ విద్యార్ధులకు సూచించింది.

  • 30 Apr 2024 11:43 AM (IST)

    రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం..

    జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మే 16వ తేదీని ఫీజు చెల్లింపులకు చివరి తేదీగా నిర్ణయించారు.  రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఫలితాలు ప్రకటించిన 15 రోజులలోపు అంటే మే 15 వరకు అవకాశం ఉంటుంది. ఒక్కోసబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. రీవెరిఫికేషన్‌ కోసం రూ.1000 చెల్లించాలి.

  • 30 Apr 2024 11:40 AM (IST)

    ప్రైవేట్‌ విద్యార్ధుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత

    ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది పరీక్షలు రాశారు. 4,94,207 రెగ్యులర్, 11,606 మంది ప్రైవేట్‌ విద్యార్ధులు ఉన్నారు. 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ విద్యార్దుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • 30 Apr 2024 11:31 AM (IST)

    3927 స్కూల్స్‌ 100 శాతం ఉత్తీర్ణత

    3927 స్కూల్స్‌ 100 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. వీటిల్లో జిల్లా పరిషత్‌ 1347, గవర్నమెంట్ 37, ప్రైవేట్ స్కూల్స్‌1814 స్కూల్స్‌లో వందశాతం ఉత్తీర్ణత వచ్చింది. కేజీవీబీ స్కూల్స్‌, మోడల్ లలో కూడా 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • 30 Apr 2024 11:28 AM (IST)

    మ్యాథమెటిక్స్‌లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

    మ్యాథమెటిక్స్‌లో 96.46 శాతం, జనరల్‌ సైన్స్‌లో 96.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి 5 శాతం మ్యాథమెటిక్స్‌లో అధికంగా ఉత్తీర్ణత వచ్చింది.

  • 30 Apr 2024 11:25 AM (IST)

    జిల్లా పరిషత్ స్కూల్స్‌ వంద శాతం ఉత్తీర్ణత నమోదు.. 6 పాటశాలల్లో జోరో ఉత్తీర్ణత

    గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. ఈ సారి మాత్రం 6 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చింది. వాటిల్లో 4 ప్రైవేట్ స్కూల్స్‌ ఉండగా.. 2 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. జిల్లా పరిషత్ స్కూల్స్‌ వంద శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం..

  • 30 Apr 2024 11:23 AM (IST)

    అన్ని మీడియంలలో ఈసారి భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

    తెలుగు మీడియంలో గతేడాది 72.05 శాతం ఉత్తీర్ణత నమోదైతే ఈ సారి 80.71 నమోదైంది.
    ఇంగ్లిష్‌ మీడియంలో గతేడాది 90.50 శాతం ఉత్తీర్ణత ఉండగా ఈ సారి 93.74 శాతం పెరిగింది.

  • 30 Apr 2024 11:22 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • 30 Apr 2024 11:20 AM (IST)

    టెన్త్‌ ఫలితాల్లో ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో తగ్గిన ఉత్తీర్ణత శాతం

    ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో ఉత్తీర్ణత తగ్గగా.. మిగిలిన అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత శాతం పెరిగింది.

  • 30 Apr 2024 11:17 AM (IST)

    తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదే

    జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం వెల్లడించారు.

  • 30 Apr 2024 11:10 AM (IST)

    తెలంగాణ పదో తరగతి రిజల్ట్స్‌ కోడ్ ఇదే..

    తెలంగాణ పదో తరగతి రిజల్ట్స్‌ పాస్ కోడ్.. SSC_RESULTS@2024

  • 30 Apr 2024 11:09 AM (IST)

    టెన్త్‌ ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్‌.. వికారాబాద్ లీస్ట్

    నిర్మల్ జిల్లా 99.05% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. అతి తక్కువగా వికారాబాద్ జిల్లా 65.10% ఉత్తీర్ణత నమోదై చివరి స్థానంలో నిలిచింది.

  • 30 Apr 2024 11:08 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు..

    తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు సత్తా చాటారు..

    • బాలురు ఉత్తీర్ణత శాతం 89.42%
    • బాలికల ఉత్తీర్ణత శాతం 93.23%

    ఈ సంవత్సరం  రాష్ట్రా వ్యాప్తంగా 3927 స్కూల్ లలో 100% ఉత్తీర్ణత నమోదైంది

  • 30 Apr 2024 11:06 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత

    పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

  • 30 Apr 2024 11:00 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి

    తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం చేతుల మీదుగా ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు.

    తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 30 Apr 2024 10:55 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..

  • 30 Apr 2024 10:52 AM (IST)

    మరికొన్ని నిమిషాల్లోనే పదో తరగతి ఫలితాలు.. ఉత్కంఠగా ఎదురు చూపులు

    ఈ రోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్న విద్య శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరితాయి.

  • 30 Apr 2024 10:47 AM (IST)

    పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోనే ‘టెన్త్’ ఫలితాలు

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికే ముగిసింది. వారం రోజుల్లోనే డీకోడిండ్‌ ప్రక్రియ కూడా ముగించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమైంది.

  • 30 Apr 2024 10:32 AM (IST)

    తొలిసారి విద్యాశాఖ ప్రయోగం.. పదో తరగతి మార్క్స్‌ మెమోపై ‘పెన్’ నెంబర్‌ ముద్రణ

    ఈసారి తెలంగాణ 10వ తరగతి మార్కుల మెమోలపై పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (పెన్) నెంబర్‌ ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దీంతో ప్రతి విద్యార్ధి టెన్త్‌ మార్క్స్‌ మెమోపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనున్నారు. ఈ పెన్ నెంబర్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడి ఉంటుందని సమాచారం.

  • 30 Apr 2024 10:27 AM (IST)

    తెలంగాణ పదో తరగతి ఫలితాల లైవ్ న్యూస్ ఇక్కడ వీక్షించండి..

Follow us on