హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో 3927 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా.. ఈ సారి మాత్రం 6 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చింది.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాటిల్లో 4 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 2 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయిన పాఠశాలల్లో.. జిల్లా పరిషత్ 1347, గవర్నమెంట్ 37, ప్రైవేట్ స్కూల్స్1814 స్కూల్స్ ఉన్నాయి. కేజీవీబీ స్కూల్స్, మోడల్ లలో కూడా 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71 శాతంతో అత్యధికంగా ఉత్తీర్ణత పొందాయి.
అలాగే రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల్లో ఈ ఏడాది సరాసరి కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించాయి. ఆశ్రమ్, ఎయిడెడ్, జడ్పీ, గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక ఈ ఏడాది కేవలం 6 పాఠశాలల్లో మాత్రమే జీరో శాతం ఫలితాలు వచ్చాయి. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. ఈ సారి సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చిన 6 స్కూల్స్‌లో.. 4 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 2 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.