SCCL Recruitment 2024: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో సింగరేణిలో ఉద్యోగాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి పదో తరగతితోపాటు..

SCCL Recruitment 2024: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పదో తరగతి అర్హతతో సింగరేణిలో ఉద్యోగాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..
Singareni Collieries Company

Updated on: Jun 12, 2024 | 6:54 AM

కొత్తగూడెంలోని సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు దారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్‌లో రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీగా జూన్‌ 29, 2024 తేదీని నిర్ణయించారు.

పోస్టుల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో పోస్టుల వివరాలు..

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ అండ్‌ ఎం), ఇ2 గ్రేడ్ పోస్టులు: 42
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్ పోస్టులు: 7

నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో పోస్టుల వివరాలు..

  • జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి పోస్టులు: 100
  • అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి పోస్టులు: 9
  • అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి పోస్టులు: 24
  • ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I పోస్టులు: 47
  • ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I పోస్టులు: 98

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతర పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us