TS Polycet 2023 Counselling: పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. 21,367 మందికి సీట్ల కేటాయింపు

|

Jun 26, 2023 | 1:18 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్ధులదరికీ సీట్లు కేటాయించారు..

TS Polycet 2023 Counselling: పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. 21,367 మందికి సీట్ల కేటాయింపు
TS Polycet 2023
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్ధులదరికీ సీట్లు కేటాయించారు. మొత్తం 116 కాలేజీల్లో 29,396 సీట్లకు గాను తొలివిడత 21,367 సీట్లను భర్తీ చేశారు. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 87.44 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సైబర్‌ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి సీట్లన్నీ భర్తీ అయినట్లు పాలీసెట్‌ కన్వీనర్ తెలిపారు. జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులే చేరారని తెలిపారు.

ప్రభుత్వ కాలేజీల్లో 1,673 సీట్లు, ప్రెవేటు కాలేజీల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కన్వీనర్‌ తెలిపారు. ఎన్‌సీసీ, క్రీడల కోటాకు సంబంధించిన సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తైన తర్వాత కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జులై 7 నుంచి 10వ తేదీలోపు చేరాలని సూచించారు. చేరని పక్షంలో వారికి కేటాయించిన సీట్లను రద్దుచేస్తామన్నారు. జులై 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.