TSLPRB Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

|

Sep 16, 2022 | 5:54 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీస్‌ శాఖలో పరిధిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ ల్యాబొరేటరీస్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 32 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

TSLPRB Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ ల్యాబొరేటరీస్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
Forensic Science Laboratory
Follow us on

Telangana Forensic Science Laboratory Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీస్‌ శాఖలో పరిధిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ ల్యాబొరేటరీస్‌.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 32 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి ఇతర సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. తెలంగాణ పోలీస్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌ విధానంలో సూచించిన అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 9, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 19, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఖాళీల వివరాలు..

  • సైంటిఫిక్‌ ఆఫీసర్‌(డీఎన్‌ఏ) పోస్టులు: 2
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(డీఎన్‌ఏ) పోస్టులు: 4
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌(డీఎన్‌ఏ) పోస్టులు: 2
  • సైంటిఫిక్‌ ఆఫీసర్‌(బయోలజీ డివిజన్‌) పోస్టులు: 3
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్(బయోలజీ డివిజన్‌) పోస్టులు:
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌(బయోలజీ డివిజన్‌) పోస్టులు: 4
  • సైంటిఫిక్‌ ఆఫీసర్‌(సైబర్‌ ఫోరెన్సిక్‌ డివిజన్‌): పోస్టులు: 2
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(సైబర్‌ ఫోరెన్సిక్‌ డివిజన్‌) పోస్టులు: 6
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌(సైబర్‌ ఫోరెన్సిక్‌ డివిజన్‌) పోస్టులు: 2
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(కెమికల్‌ డివిజన్‌) పోస్టులు: 4

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.