
హైదరాబాద్, జులై 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎల్‌ఎల్‌బీ సీట్ల భర్తీకి లాసెట్, ఎల్‌ఎల్‌ఎం మాస్టర్ కోర్సుల్లో చేరేందుకు పీజీ ఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ మూడింటికి సంబంధించిన షెడ్యూల్‌లను ఉన్నత విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఇందులో పీజీఈసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇక లాసెట్ కౌన్సెలింగ్ (యూజీ) ఆగస్టు 4 నుంచి, పీజీ ఎల్‌సెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీ సమావేశాలు నిర్వహించి, ఈ మేరకు షెడ్యూల్‌లను ఖరారు చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.