హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ లాసెట్ 2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ గురువారం (జూన్ 6) విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై జూన్ 7వ తేదీలోగా అభ్యంతరాలు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలియజేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి, వెనువెంటనే ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు.
కాగా జూన్ 3వ తేదీన తెలంగాణ లాసెట్ పరీక్షను పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ పరీక్ష ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు టీఎస్ పీజీఎల్‌సెట్ 2024 పరీక్ష నిర్వహింరు. లాసెట్, పీజీఎల్‌సెట్ లో వచ్చిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని న్యాయ కాలేజీల్లో న్యాయవిద్యలో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ లాసెట్ 2024 ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.