TG LAWCET 2024 Counselling: ఆగస్టు తొలి వారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. త్వరలో షెడ్యూల్ విడుదల

|

Jul 18, 2024 | 6:53 AM

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ కౌన్సెలింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయాత్తం అవుతోంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. అయితే న్యాయ విద్య అందించే ఆయా కాలేజీలకు ఇంకా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. జులై నెలాఖరులోపు బీసీఐ..

TG LAWCET 2024 Counselling: ఆగస్టు తొలి వారంలో లాసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. త్వరలో షెడ్యూల్ విడుదల
TG LAWCET 2024 Counselling
Follow us on

హైదరాబాద్‌, జులై 18: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్‌ కౌన్సెలింగ్‌ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాయాత్తం అవుతోంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. అయితే న్యాయ విద్య అందించే ఆయా కాలేజీలకు ఇంకా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. జులై నెలాఖరులోపు బీసీఐ అనుమతులు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది. అంతా అనుకన్నట్లు జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది.

ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మూడేళ్లు ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో రాష్ట్రంలోని పలు న్యాయ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికార వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

తెలంగాణ సీపీగెట్‌ పరీక్షకు 64,765 మంది హాజరు.. నెలాఖరులోపు ఫలితాల వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పీజీ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ వంటి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 88.31 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. సీపీగెట్‌ పరీక్షలు జులై 6వ తేదీ నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 73,342 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 64,765 మంది పరీక్షలు హాజరయ్యారు. మొత్తం 51 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అందులో 45 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరిపామని సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ జులై 20వ తేదీలోపు వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరులోపు సీపీగెట్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించనున్నట్లు కన్వినర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.