
హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 9,79,506 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటి వరకు పరీక్ష ఫీజులు చెల్లించినట్లు పేర్కొంది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే వరకు ఫీజు చెల్లించకపోతే.. అటువంటి వారికి మరో అవకాశం ఇస్తూ బోర్డు తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 31వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా ప్రకటన మేరకు డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్ధులు ఆయా జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్‌లకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. కాగా ఈ ఏడాది అక్టోబరులో పరీక్షల ఫీజు షెడ్యూల్ ప్రకటించగా.. ఇందులో ఇచ్చిన వివరాల ప్రకారం ఆలస్య రుసుం గడువు డిసెంబరు 15వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో ఈ నెలాఖరు వరకు పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనుండగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ నిర్వహించనున్నారు.
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ XIV స్కేల్ I 2025 మెయిన్స్ పరీక్ష మరో ఐదు రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. డిసెంబర్ 28న జరగనున్న మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద రూరల్ బ్యాంకుల్లో మొత్తం 13,217 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో 3, 907 స్కేల్ I అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. మెయిన్స్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.