TS Intermediate 1st Year Result: తెలంగాణ ఇంటర్మీడియేట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫలితాలు రేపు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీంతో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ నెలలో..
కాగా, మరో వైపు వచ్చే ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయతే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 23 నుంచి జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా తరగతులు సైతం ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఈ పరీక్షలు కూడా ఆలస్యంగా నిర్వహించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: