TS Inter Results: తెలంగాణలో జరిగిన ఇంటర్ ఫలితాలపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల మొదట్లోనే ఫలితాలు వస్తాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక జూన్ 15 ఫలితాలు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడన్నదానిపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తోన్న సమాచారం జూన్ చివరి నాటికి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 25 తర్వాత ఫలితాలను విడుదల చేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఉన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలన్నుట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,393 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ప్రస్తుతం 14 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతోంది. మూల్యాంకనం ఆలస్యం కావడం వల్లే ఫలితాలు ఆలస్యమైనట్లు సమాచారం. పరీక్షలు ముగిసి దాదాపు నెల రోజులు దగ్గర పడుతోన్న నేపథ్యంలో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..