Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
Telangana Intermediate Board Results 2025 Highlights: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు మరికొన్ని నిమిషాల్లో తెరపడనుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానున్నాయి. ఈ రోజు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీస్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాక అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లోనూ మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
LIVE NEWS & UPDATES
-
ఇంటర్ ఫలితాల్లో టాప్ లో నిలిచిన జిల్లాలివే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (77.59 శాతం) టాప్‌లో నిలిచింది. సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్ధులు అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఇంటర్ సెకెండ్ ఇయర్‌లో ఫస్ట్ ములుగు జిల్లా (80.12 శాతం), రెండో స్థానం ఆసిఫాబాద్ జిల్లా (79.52 శాతం)లకు చెందిన విద్యార్ధులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు.
-
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ వివరాలివే..
ఇంటర్ విద్యార్ధులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పించారు. విద్యార్ధులు BIE వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా రీకౌంటింగ్‌కు ఒక్కో పేపర్ పేపర్‌కు రూ.100 చెల్లించాలి. స్కాన్ చేసిన కాపీ-కమ్-రివరిఫికేషన్ కోసం పేపర్‌కు రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రీకౌంటింగ్, స్కాన్ చేసిన కాపీ-కమ్-రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు ఏప్రిల్ 23 నుంచి 30, 2025వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.
-
-
ఇంటర్ లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదు
ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా.. వీరిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.
-
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు
-
ఇంటర్ సెకెండ్ ఇయర్ లో ములుగు జిల్లా టాప్
ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ములుగు జిల్లా, రెండో స్థానం ఆసిఫాబాద్ నిలిచింది.
-
-
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడ్చల్ జిల్లా ఫస్ట్, సెకెండ్ స్థానం కొమురం భీం ఆసిఫాబాద్ నిలిచింది.
-
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. 73.83 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలు సత్తా చాటారు. బాలురు కంటే బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. బాలికలు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించారు.
-
మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2025 పరీక్షలు
ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్దులకు మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
-
ఇంటర్ విద్యార్థులకి సీఎం రేవంత్ శుభాకాంక్షలు
ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. సీఎం జపాన్ పర్యటనలో ఉండి విద్యార్థులకి అభినందనలు తెలిపారు.
-
ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు
ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలియజేశారు.
-
ఇంటర్‌లో ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత
ఇంటర్‌లో ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది
-
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాలు విడుదలు విడుదలయ్యాయి. విద్యార్ధులు తమ మార్కులను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రముఖులు
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య హాజరయ్యారు.
-
ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమం ప్రారంభం
ఇప్పడే ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాసేపటిలో ఫలితాలు విడుదల
-
ఇంటర్ ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం
ఇంకా ప్రారంభంకాని విడుదల కార్యక్రమం.
-
తెలంగాణ ఇంటర్ ఫలితాల 2025 ప్రత్యక్ష ప్రసారం వీడియో
తెలంగాణ ఇంటర్ ఫలితాల 2025ను ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఈ వీడియో ఇదే..
-
ఇంటర్మీడియట్ లో అన్ని సబ్జెక్టుల్లో పాసై.. ఒక్క సబ్జెక్టులో ఫెయిలైతే..!
ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసై.. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లను మరోసారి మూల్యాంకనం చేసింది ఇంటర్ బోర్డు. అంతేకాదు ఒక సబ్జెక్టులో 33 మార్కులు వస్తే రీ వాల్యుయేషన్‌లో 36 మార్కులు వచ్చినట్టు ఓ ఎగ్జామినర్ తెలిపారు. దీనిని బట్టి చూస్తే రీ వాల్యుయేషన్ నిర్ణయంతో కొందరు విద్యార్థుల మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాల్యుయేషన్ ప్రక్రియలో జరిగే ఈ విధమైన తప్పుల నివారణకే రీ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రద బాయి తెలిపారు. కాబట్టి ఇంటర్ మూల్యాంకనంలో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్ధుల జవాబు పత్రాలపై అధికారులు ఓ కన్ను వేసినట్లు తెలుస్తుంది.
-
తెలంగాణ ఇంటర్ 2025 ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్ 2025 ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి. డైరెక్ట్ లింక్ ఇదే
-
దాదాపు 10 లక్షల మంది విద్యార్ధుల నిరీక్షణ.. మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య పొల్గొననున్నారు.ఒకేసారి ఇంటర్ ఫస్ట్ అండ్ సెకెండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ పరీక్షలు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాశారు.
-
ఇంటర్ విద్యార్ధులందరినీ ఆ సినిమా చూడాలంటూ.. ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే విద్యార్థులు మనస్తాపానికి, ఆందోళనకు గురికావద్దన్నారు. ఒక్క పరీక్ష ఫలితమే అంతిమం కాదని, పరీక్షల్లో ఫెయిలైతే జీవితమే ముగిసిపోయినట్లు భావించకూడదని అన్నారు. జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయని,తిరిగి విజయం సాధించవచ్చని అన్నారు. ఒక్కసారి ఇంటర్ విద్యార్ధులందరూ ’12th ఫెయిల్’ అనే సినిమా OTTలో ఉంది. మీరంతా చూడండి. అపజయం కూడా విజయానికి మెట్టు లాంటిదే. ఎక్కుతూ పోవాలితప్ప కుంగి పోకూడదంటూ సూచించారు.
-
ఈసారి ఇంటర్ రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ గందరగోళం లేనట్లే.. ఎందుకంటే?
యేటా సుమారు 50 వేల మంది విద్యార్ధులు ఫీజు చెల్లించి రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతుంటాయి. గతంలో ఓ విద్యార్ధికి 99 మార్కులు వస్తే సున్నా మార్కులు వేయడంతో అప్పట్లో పెద్ద గందరగోళమే జరిగింది. అలాగే ఫెయిల్ అయిన విద్యార్ధులు కూడా పలువురు రీ వాల్యుయేషన్‌లో పాసయ్యారు. వీటన్నింటి దృష్ట్యా ఈసారి ఇంటర్ బోర్డు ఇలాంటి తప్పిదాలు జరగకూడదని మూల్యంకనం ప్రక్రియనే మరోమారు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వాల్యుయేషన్ పూర్తయిన జవాబు పత్రాలనే రీ వాల్యుయేషన్ చేశారన్నమాట.
-
ఇంటర్ మూల్యాంకనంలోనే రీవాల్యుయేషన్ కూడా.. పొరబాట్లు ఉండవిక..!
సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు సరిగ్గా రాలేదని, అధ్యాపకులు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో ర్యాండమ్‌గా పునఃపరిశీలించి వాటిని మరోమారు కౌంట్ చేశారు. దీంతో విద్యార్థులకు మార్కుల విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను మూల్యాంకనం ప్రక్రియలోనే అధికారులు పూర్తి చేశారు. దీంతో ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో మార్కుల్లో విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తవనే చెప్పవచ్చు.
-
నేటి మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టీ చేతుల మీదగా ఇంటర్ ఫలితాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులు రాశారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు, 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేస్తారు.
-
9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్ధుల నిరీక్షణ..
2024-25 విద్యా సంవత్సరానికి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ తోపాటు టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లోనూ నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్‌నంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
-
తెలంగాణ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాల డైరెక్ట్ లింక్
తెలంగాణ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published On - Apr 22,2025 10:48 AM
