Telangana: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌ టికెట్ల విడుదల: ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

|

Oct 21, 2021 | 11:09 AM

తెలంగాణ స్టేట్‌ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ (టీఎస్‌బీఐఈ) ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల

Telangana: ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌ టికెట్ల విడుదల: ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..
Inter Board
Follow us on

తెలంగాణ స్టేట్‌ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ (టీఎస్‌బీఐఈ) ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబర్‌ 2 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం వరకు జరుగుతాయని…పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డులు తెచ్చకోవాలని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. అదేవిధంగా కొవిడ్‌ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా మాస్కులు కచ్చితంగా ధరించాలని చెప్పుకొచ్చింది. పరీక్షా కేంద్రాల్లో కూడా శానిటైజర్‌, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

హాల్ టిక్కెట్లు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..
1.ముందుగా ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ను ఓపెన్‌ చేయాలి
2.అనంతరం TSBIE IPE 2021 First Year Hall Tickets లింక్‌పై క్లిక్‌ చేయాలి.
3.ఇప్పుడు లింక్‌ ఓపెన్‌ అవుతుంది.
4.అవసరమైన వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌ కొట్టగానే మీ హాల్‌ టికెట్‌ కనిపిస్తుంది. దీనిని డౌన్‌లౌడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి.

వివరాలు సరిచూసుకోండి..
విద్యార్థులు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగానే తమ వ్యక్తిగత వివరాలు సరిచూసుకోవాలి. పేరు, పుట్టిన తేది, పాఠశాల పేరు, సబ్జెక్టుల వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అక్షర దోషాలు ఉంటే గుర్తించాలి. ఏవైనా తప్పులుంటే ఇంటర్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.

Also Read:

Sainik School Admission 2022: సైనిక్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ వచ్చింది.. తేదీల వివరాలు, దరఖాస్తు చేయడం ఎలానో తెలుసుకోండి..

SBI PO Recruitment: ఎస్‌బీఐ పీవో పోస్టులకు అప్లై చేసుకున్నారా.. దరఖాస్తులకు చివరి తేదీ దగ్గర పడుతోంది..

NTA CUCET Result 2021: సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..