TS Inter Admissions 2022: జూన్‌ 30 నాటికి తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జులై 1న ఫస్టియర్ క్లాసుల ప్రారంభం కష్టమే..

|

May 18, 2022 | 4:10 PM

తెలంగాణ విద్యాశాఖ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంటర్‌బోర్డు (TSBIE) అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు (Inter First Year classes) జులై 1 నుంచి..

TS Inter Admissions 2022: జూన్‌ 30 నాటికి తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. జులై 1న ఫస్టియర్ క్లాసుల ప్రారంభం కష్టమే..
Inter Classes
Follow us on

Telangana Inter academic year likely to be delayed: తెలంగాణ విద్యాశాఖ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంటర్‌బోర్డు (TSBIE) అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు (Inter First Year classes) జులై 1 నుంచి ప్రారంభమవుతాయని చెప్పినప్పటికీ ఆ రోజు నుంచి మొదలవడం కష్టమేనని తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయి. జూన్‌ 2 నుంచి మూల్యాంకనం మొదలవుతుంది. కనీసం 10 రోజులపాటు జవాబుపత్రాలను దిద్దుతారు. ఆ తర్వాత ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది. జూన్‌ 30 నాటికి పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డు తెల్పింది. ఒక వేళ నాలుగైదు రోజులు ముందుగా ఫలితాలు ఇచ్చినా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికావడానికి కొంత సమయం అవసరం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి జులై 15 తర్వాత తరగతులు మొదలయ్యే అవకాశం ఉందని జూనియర్‌ కాలేజీల యాజమన్యాలు అభిప్రాయపడుతున్నాయి. మరో వైపు ఇంటర్‌ పాఠ్య పుస్తకాల ముద్రణ ఇంకా మొదలుకాలేదు. ఇప్పటికీ ముద్రణదారుల టెండర్లే ఖరారు కాకపోవడం గమనార్హం.

మరోవైపు మే 20వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని తెలంగాణ సర్కార్‌ తాజాగా ప్రకటించింది. సెలవుల అనంతరం జూన్ 15 నుంచి ఇంటర్ సెకండియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని, జులై 1 నుంచి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించింది. ఈ ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా పాటించాలని విద్యా శాఖ వెల్లడించింది. ఐతే పదో తరగతి పరీక్షల దృష్ట్యా జులై 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం అవ్వడమనేది కష్టసాధ్యమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.