తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు (Intermediate Board) శుభవార్త చెప్పింది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరిగే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. అయితే ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు ఒక ప్రకటన జారీ చేశారు. కాగా విద్యార్థులు (Inter Students) చదివే కళాశాలల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక కళాశాలలోని విద్యార్థుల్లో 25 శాతం మంది కంటే 30కి 30 మార్కులు వచ్చిన వారి, అదేవిధంగా 27-30 మార్కులు వచ్చిన వారి సమాధాన పత్రాలను తాము మరోసారి పునఃపరిశీలన చేస్తామని స్పష్టం చేశారు.
ఆ కళాశాలలకు జరిమానా..
కాగా ప్రాక్టికల్స్‌కు ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయకుంటే సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అదేవిధంగా ప్రాక్టికల్స్ ఎగ్జామినర్లు విద్యార్థులకు వేసిన మార్కులను అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలని సూచించింది. కాగా ఆదివారం (మార్చి20) నుంచి ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్స్ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. కాగా మే 6 నుంచి మే 24 వరకు మెయిన్ ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే జరుగుతాయని వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల షెడ్యూల్ కూడా విడుదలైంది.
Also Read:Viral Video: చిరుతపులి, బ్లాక్ పాంథర్ మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదిరిపోతాయి..!
Vastu tips: దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే.. పడకగదిలో ఈ ఫోటోలను పెట్టుకోండి..