TS ICET 2024 Application Last Date: తెలంగాణ ఐసెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు.. ఎప్పటి వరకంటే..

|

May 01, 2024 | 9:52 PM

తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేర‌కు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఐసెట్ క‌న్వీన‌ర్ బుధవారం (మే 1) ప్రకటన విడుద‌ల చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ లింబాద్రి, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీ టీ ర‌మేశ్‌, క‌న్వీన‌ర్‌ ప్రొఫెస‌ర్ ఎస్ న‌ర్సింహాచారి సంయుక్తంగా..

TS ICET 2024 Application Last Date: తెలంగాణ ఐసెట్ ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు.. ఎప్పటి వరకంటే..
TS ICET 2024
Follow us on

హైదరాబాద్‌, మే 1: తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేర‌కు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఐసెట్ క‌న్వీన‌ర్ బుధవారం (మే 1) ప్రకటన విడుద‌ల చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండ‌లి చైర్మన్ లింబాద్రి, కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీ టీ ర‌మేశ్‌, క‌న్వీన‌ర్‌ ప్రొఫెస‌ర్ ఎస్ న‌ర్సింహాచారి సంయుక్తంగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎలాంటి ఆల‌స్యం రుసుం లేకుండా మే 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.550, ఇతరులు రూ.750 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మే 17వ తేదీ నుంచి 20 తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇచ్చారు. మే 28వ తేదీ నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే జూన్‌ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో ఐసెట్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రోజు ఆలస్యంగా ఐసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

జూన్‌ 5, 6వ తేదీల్లో ఐసెట్‌ పరీక్ష నిర్వహింహిచాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పరీక్ష అనంతరం జూన్‌ 15న ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేసి, దానిపై జూన్‌ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్‌ 28వ తేదీన ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. ఇక ఐసెట్‌ ఫలితాలు జూన్‌ 28వ తేదీన విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.