TG Horticulture Admisisons 2025: హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ముఖ్యవివరాలు ఇవే

రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా సాధించిన ర్యాంకులతో ఆదిలాబాద్‌ జిల్లాలోని దస్నాపూర్‌, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్‌కర్నూల్‌ జిల్లా..

TG Horticulture Admisisons 2025: హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ముఖ్యవివరాలు ఇవే
Horticulture Admisisons

Updated on: Jun 10, 2025 | 7:42 AM

హైదరాబాద్‌, జూన్‌ 10: తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా సాధించిన ర్యాంకులతో ఆదిలాబాద్‌ జిల్లాలోని దస్నాపూర్‌, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్‌ 26వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఇచ్చినట్లు రిజిస్ట్రార్‌ భగవాన్‌ సూచించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం ఉద్యాన యూనవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌  ను సందర్శించాలని సూచించారు. లేదా 96032 68682, 91215 57037, 93981 66973, 70751 20145 ఫోన్‌ నంబర్లను కూడా సంప్రదించవచ్చని రిజిస్ట్రార్‌ తెలిపారు.

నీట్, జేఈఈ 2025 ర్యాంకర్లకు అభినందనలు

నీట్, జేఈఈ 2025లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అలైన్‌ దక్షిణ జోన్‌ హెడ్, ఉపాధ్యక్షుడు మహేష్‌ యాదవ్‌ అభినందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో అలైన్‌ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధులను ప్రశంసించారు. ఈ సందర్భంగా మహేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని అన్నారు. విద్యార్థులు నిరంతర ప్రయత్నం చేస్తూ అభివృద్ధి సాధించాలని కోరారు. 2024 నీట్‌లో ప్రతిభ చూపిన మాజిన్‌ మన్సూర్, దివ్యాంశ్‌ జితేంద్ర, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025లో ఆలిండియా 22వ ర్యాంకు సాధించిన మోహన్, 100వ ర్యాంకు సాధించిన సాయి అనిష్‌రెడ్డి, 2024 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా 80వ ర్యాంకు వచ్చిన అభినవ్‌లను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.