తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన హైకోర్ట్ తాజాగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్(నం.03/2023) జారీ చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ(ఆర్ట్స్/ సైన్స్/ లా) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంగ్లిష్ హయ్యర్ గ్రేడ్ టైప్‌రైటింగ్, పీజీ డిప్లొమా(కంప్యూటర్ ప్రోగ్రామింగ్/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-01-2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 38,890 నుంచి రూ.1,12,510 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 21-01-2023 నుంచి ప్రారంభవుతుండగా 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* హాల్ టికెట్లను 20-02-2023 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..