తెలంగాణ స్టేట్ జుడీషియల్ సర్వీస్ కింద జిల్లా జడ్జి (ఎంట్రీ లెవెల్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మే 1 దరఖాస్తు గడువు ముగిసేలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 11 జడ్జి పోస్టుల నియామకాలకు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,44,840ల నుంచి రూ.1,94,660ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.