
హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు సంబంధించిన వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. టీజీపీఎస్సీతో పాటు ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు మరోమారు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో పునర్మూల్యాంకనం చేపట్టి, వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని, లేదంటే తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీతోపాటు మెయిన్స్‌లో ఎంపికైన పలువురు అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్లు రాతపూర్వక వాదనలను సోమవారం సమర్పించడంతో విచారణను డిసెంబరు 22వ తేదీకి వాయిదా వేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. ఇకపై రాతపూర్వక వాదనలు సమర్పించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు చెల్లింపునకు రూ.87 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించి 9, 10 తరగతుల విద్యార్థుల చెల్లించవల్సిన ఉపకారవేతనాలను ఈ మేరకు విడుదల చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.