TSPSC Group-1 Prelims 2022: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఎంత కఠినం? సివిల్స్‌ స్థాయికి మించి ప్రశ్నాపత్రం..

|

Oct 17, 2022 | 1:16 PM

నిన్న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు..

TSPSC Group-1 Prelims 2022: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఎంత కఠినం? సివిల్స్‌ స్థాయికి మించి ప్రశ్నాపత్రం..
TSPSC Group-1 Prelims Exam 2022
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా టీఎస్సీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (అక్టోబ‌రు 16) జరిగింది. 503 పోస్టులకు గానూ ఈ పరీక్షకు మొత్తం 3 లక్షల 80 వేల మంది దనఖాస్తు చేసుకోగా, 3 లక్షల 42 వేల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక నిన్న జరిగిన పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది అంటే 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా, బయోమెట్రిక్‌ హాజరుతో ఎటువంటి అవాంచిత సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. ఓఎంఆర్‌ స్కానింగ్ తర్వాత ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. అందుకు కనీసం ఎనిమిది రోజుల సమయం పడుతుందని కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్లో పొందుపరుస్తామని వెల్లడిచింది.

సివిల్‌ సర్వీస్‌ పరీక్షల స్థాయికి మించి గ్రూప్‌-1 ప్రశ్నాపత్రం

నిన్న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని అన్నారు. ప్రిలిమ్స్‌ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ థింకింగ్‌ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సమాధానాలు గుర్తించేందుకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం మాత్రమే ఉంటుంది. ఐతే ప్రశ్నల కాఠిన్యం దృష్టా నిముషం సమయం సరిపోలేదని, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు అధికంగా వచ్చాయని అన్నారు. నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ప్రశ్నలను పూర్తిగా చదివేందుకు కూడా సమయం సరిపోలేదని అన్నారు. అందువల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేక పోయామని, సగటున 15 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించలేకపోయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

స్క్రీనింగ్‌ టెస్ట్‌ అయిన ప్రిలిమ్స్‌ కఠినంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులు తక్కువగా ఉండే అవకాశం ఉందని పులువురు భావిస్తున్నారు. కటాఫ్‌ 75 నుంచి 85 మధ్యలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.