New Syllabus 2026: బీఈడీ, డీఎడ్‌ కోర్సుల సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇదే బాటలో డిగ్రీ కోర్సులు సైతం!

బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులకు కొత్త సిలబస్‌ తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్‌ 31) సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించింది. అలాగే రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలను..

New Syllabus 2026: బీఈడీ, డీఎడ్‌ కోర్సుల సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇదే బాటలో డిగ్రీ కోర్సులు సైతం!
New Syllabus For Treacher Training Courses

Updated on: Jan 01, 2026 | 12:30 PM

హైదరాబాద్‌, జనవరి 1: టీచర్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులైన బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈ కోర్సుల సిలబస్‌ మార్చాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. బీఎడ్‌, డీఎడ్‌ కోర్సులకు కొత్త సిలబస్‌ తయారు చేయాలని భావిస్తుంది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్‌ 31) సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగించింది. అలాగే రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు (ఏటీసీ)గా అప్‌గ్రేడ్‌ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై తాజా సమావేశంలో టీసీఎస్‌ ప్రతినిధులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పాలిటెక్నిక్‌ కోర్సుల సిలబస్‌ను సైతం మార్చాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అదేవిధంగా పాలిటెక్నిక్‌ కోర్పులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించాలని సూచించారు.

డిగ్రీ సిలబస్‌లోనూ భారీ మార్పులు చేయాలి: ఉన్నత విద్యామండలి

తెలంగాణ డిగ్రీ సిలబస్‌లోనూ మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. తద్వారా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత తరహాలో అకాడమిక్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్‌ఆర్‌)ను విస్తృతంగా ప్రోత్సహిస్తామని అన్నారు. అలాగే అన్ని స్థాయిల్లోనూ అకాడమిక్‌ ఆడిటింగ్‌ చేపడుతామని అన్నారు. ఈసారి డిగ్రీ సిలబస్‌ను నైపుణ్యాధారిత విద్యాకోర్సులకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకొస్తామని తెలిపారు. యేటా డిగ్రీ కోర్సుల్లో భారీగా సీట్లు మిగులుతున్నాయని, దీనికి పరిష్కారంగా రేషనలైజేషన్‌ను చేపడుతామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.